ముని-3లో నిత్యామీనన్ | Nithya Menon plays a physically challenged girl in 'Muni 3' | Sakshi
Sakshi News home page

ముని-3లో నిత్యామీనన్

Dec 10 2013 4:02 AM | Updated on Sep 2 2017 1:25 AM

ముని-3లో నిత్యామీనన్

ముని-3లో నిత్యామీనన్

ముని-3 చిత్రంలోకి నటి నిత్యామీనన్ వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం గంగా. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ముని,

 ముని-3 చిత్రంలోకి నటి నిత్యామీనన్ వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం గంగా. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ముని, కాంచన చిత్రాలకు సీక్వెల్. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. తాజాగా నిత్యామీనన్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె ఒక ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తుండం విశేషం. షూటింగ్‌లో కాలికి బలమైన గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న లారెన్స్ తాజాగా చిత్ర షూటింగ్‌కు సిద్ధమయ్యారు. 
 
 చెన్నైలో వేసిన భారీ సెట్‌లో ముని -3 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇందులో నిత్యామీనన్ దెయ్యంగా ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దెయ్యం పాత్ర అయినా చాలా రొమాంటిక్‌గా ఉంటుందట. హీరోయిన్‌గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తాజాగా జేకే ఎండ్రుం ఒరు నన్బనిన్ కథై చిత్రంతో కోలీవుడ్‌లోను మంచి పేరు తెచ్చుకుంది. త్వరలో ఈ బ్యూటీ నటించిన మాలిని 22 పాలైయంకోట్టై చిత్రం తెరపైకి రానుంది. ఇలాంటి సమయంలో ముని -3 లో దెయ్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement