నాగ అన్వేష్ హీరోగా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ | A Nimishaniki Yemi Jaruguno Movie Opening | Sakshi
Sakshi News home page

Mar 4 2018 3:49 PM | Updated on Mar 4 2018 3:52 PM

A Nimishaniki Yemi Jaruguno Movie Opening - Sakshi

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ మూవీ ఓపెనింగ్‌

షో టైం స్టూడియో సమర్పించు గణేష్ క్రియేషన్స్ సంస్థ నుంచి నాలుగవ ప్రొడక్షన్ గా ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే చిత్రం తెరకెక్కనుంది. నాగ అన్వేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ... ‘మా బ్యానర్ లో తొలిచిత్ర ఓపెనింగ్ స్వర్గీయ రామానాయుడి గారి చేతుల మీదుగా జరిగింది. ప్రస్తుతం మా బ్యానర్‌లో నాలుగవ సినిమాను రూపొందిస్తున్నాం. నేను లండన్ లో ఉండటం మూలాన లండన్ అనేది ఇంటిపేరుగా మారిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో  యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ అన్వేష్‌ హీరోగా,  నా స్నేహితుడు నాగేశ్వర రావు సహకారంతో  నిర్మించడం జరుగుతోంది. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందే చిత్రం అవుతుందని భావిస్తున్నా’  అన్నారు.

మరో నిర్మాత వి.నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ‘మంచి కథ అవడంతోనే నేను భాగస్వామిని అయ్యాను. ఫారిన్, సిటీ, ఫారెస్ట్ ఇలా  3 షెడ్యూల్లలో షూటింగ్ ఉంటుంది.  కొత్త కథ కనుక ఆడియన్స్ కు నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. హీరో నాగ అన్వేష్‌ మాట్లాడుతూ.. ‘చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. టైటిల్ కు తగ్గట్టుగానే ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అనే విదంగానే ఉంటుంది ప్రతి సన్నివేశం. టాలీవుడ్ లొనే డిఫరెంట్ సబ్జెక్టుగా నిలుస్తుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. ‘సైన్క్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించిన వి వి వినాయక్, సాగర్, మరియు రమణ గారికి నా కృతజ్ఞతలు’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement