జస్ట్‌ ఫ్రెండ్‌.. అంతే!

Nidhi Agarwal Reacts On Dating with Cricketer KL Rahul - Sakshi

రెండు మూడు రోజుల నుంచి బీటౌన్లో ఒకటే గుసగుస. హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ డేటింగ్‌ గురించి. క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారని ఈ గుసగుసల సారాంశం. అయితే ఈ గుసగుసల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిధీ అగర్వాల్‌. ‘‘రాహుల్‌ నాకు జస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే. అతను క్రికెటర్‌ కాకముందునుంచి నాకు తెలుసు. నేను హీరోయిన్‌ కాకముందే అతనికి నేను తెలుసు. అందుకని మాట్లాడుకుంటుంటాం.

అంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లేనా? రాహుల్‌ది కూడా బెంగళూరునే’’ అని చెప్పుకొచ్చారు ఈ మంగుళూరు బ్యూటీ. నిధీ అగర్వాల్‌ మూలాలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీని, ఆమె చదువుకుంటూ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ఆ సంగతి అలా ఉంచితే... నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో నిధీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ సినిమాతోనే నిధీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top