భాగ్యనగరంలో పోరాటాలు | Nenokkadine Shooting in Hyderabad | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో పోరాటాలు

Sep 11 2013 1:07 AM | Updated on Sep 1 2017 10:36 PM

భాగ్యనగరంలో పోరాటాలు

భాగ్యనగరంలో పోరాటాలు

ఒక హీరో సినిమాకు ‘1’ అనే టైటిల్ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ముఖ్యంగా సదరు హీరోకి అంతటి సామర్థ్యం, ఆ టైటిల్‌ని తట్టుకునే ఇమేజ్ ఉండాలి. లేకపోతే... నవ్వులపాలే. కానీ ధైర్యంగా సుకుమార్ తన చిత్రానికి ‘1’ ‘నేనొక్కడినే’ అనే టైటిల్ పెట్టారు.

ఒక హీరో సినిమాకు ‘1’ అనే టైటిల్ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ముఖ్యంగా సదరు హీరోకి అంతటి సామర్థ్యం, ఆ టైటిల్‌ని తట్టుకునే ఇమేజ్ ఉండాలి. లేకపోతే... నవ్వులపాలే. కానీ ధైర్యంగా సుకుమార్ తన చిత్రానికి ‘1’ ‘నేనొక్కడినే’ అనే టైటిల్ పెట్టారు. ఆయనకు అంతటి ధైర్యం ఎక్కడ్నుంచీ వచ్చింది? ఈ ప్రశ్నకు సమధానం ఒక్కటే. ‘మహేష్‌బాబు’. ఈ టైటిల్ మహేష్‌ది అవ్వడం వల్లే ఇప్పటివరకూ ఎలాంటి విమర్శలు రాలేదన్నది నిర్వివాదాంశం.
 
వరుస విజయాలతో దూసుకుపోతూ, ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ అందరితో ‘నంబర్‌వన్’ అనిపించుకుంటున్నారు మహేష్. వాణిజ్య ప్రకటనల పరంగా కూడా మహేషే అందరికంటే ముందున్నారు. అందుకే ఈ టైటిల్ మహేష్‌కి యాప్ట్ అని చెప్పక తప్పదు. టైటిల్‌కి, మహేష్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రం ఉండబోతోందని యూనిట్ వర్గాల భోగట్టా. ఓ అందమైన శిల్పాన్ని చెక్కుతున్నట్లుగా ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపు దిద్దుతున్నారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో పీటర్‌హెయిన్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్. 
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. సుకుమార్, దేవిశ్రీ కలయికలో వచ్చిన గత చిత్రాలకు ధీటుగా ఈ ఆల్బమ్ ఉండబోతోందట. కీర్తి సనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement