స్టన్నింగ్‌ సర్‌ప్రైజ్‌ | Nayanthara's new horror film goes on floors | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌ సర్‌ప్రైజ్‌

Published Fri, Jun 15 2018 12:22 AM | Last Updated on Fri, Jun 15 2018 12:22 AM

Nayanthara's new horror film goes on floors - Sakshi

అవును.. కథానాయిక నయనతార నటించబోయే కొత్త సినిమాలో స్టన్నింగ్‌ సర్‌ప్రైజ్‌ ఏదో ఉందట. మరి.. ఆ సర్‌ప్రైజ్‌ తాలూకు డీటేల్స్‌ ఏమైనా లీక్‌ అయ్యాయా? అంటే.. ఇది హారర్‌ బేస్డ్‌ అండ్‌ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ అట. మణిరత్నం, మురుగదాస్‌ వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన  కేఎమ్‌. సర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ షార్ట్‌ ఫిల్మ్స్‌ ‘మా’, లక్ష్మి’లకు ఈయనే దర్శకుడు. నయనతారతో ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా షూటింగ్‌ మొదలైంది.

గతేడాది నయనతార నటించిన ‘ఆరమ్‌’ సినిమాను నిర్మించిన కేజేఆర్‌ స్టూడియో సంస్థ ఈ  సినిమాను నిర్మిస్తోంది. ‘‘నయనతార ముఖ్య తారగా మా సంస్థలో మరో చిత్రం మొదలైనందుకు ఆనందంగా ఉంది. యంగ్‌ టీమ్‌ కూడా తోడైంది. కొన్ని స్టన్నింగ్‌ సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయని గ్యారంటీగా చెప్పగలం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటుల వివరాలను చిత్రబృందం ప్రస్తుతానికి పేర్కొనలేదు. ఈ సినిమాతో కలిపి నయనతార చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement