చదివేస్తున్నారు

Nawazuddin Siddiqui joins Rajinikanth’s Thalaivar 165 - Sakshi

కైసా హై? క్యా కర్తా హై? అని హిందీ లాంగ్వేజ్‌లో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీని ప్రశ్నలు అడిగితే తమిళంలో ఆన్సర్స్‌ చెబుతున్నారు. ఎందుకంటే రజనీకాంత్‌కు దీటుగా డైలాగ్స్‌ చెప్పాలని తమిళ డైలాగ్స్‌ ప్రిపేర్‌ అవుతున్నారాయన. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించన్నారు. 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలీవుడ్‌లో ఎన్నో డిఫరెంట్‌ రోల్స్‌ చేసిన ఆయన ఈ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘‘నా తొలి తమిళ సినిమాకు డైలాగ్స్‌ ప్రిపేర్‌ అవుతున్నాను. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ఓ ఫొటోను షేర్‌ చేశారు సిద్ధిఖీ. ఫొటో చూస్తుంటే నవాజుద్దీన్‌ శ్రద్ధగా చదివేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top