మరో మల్టీస్టారర్‌లో..!

nani new movie with indraganti mohan krishna - Sakshi

దాదాపు మూడేళ్లుగా ఏడాదికి కనీసం మూడు సినిమాలను థియేటర్‌లో వేసేలా ప్లాన్‌ చేస్తున్నారు హీరో నాని. ఇదే స్పీడుని వచ్చే ఏడాది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ ‘జెర్సీ’లో నటిస్తున్నారు. అలాగే విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించనున్న మల్టీస్టారర్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.  ఈ ఏడాది నాగార్జునతో కలిసి నాని ‘దేవదాసు’ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

తాజా చిత్రంలో మరో కథానాయకుడిగా సౌత్‌లో కొందరు ప్రముఖ హీరోల పేర్లను పరిశీలిస్తున్నాట టీమ్‌. ఆ హీరో ఫైనలైజ్‌ కాగానే అధికారికంగా చిత్రవిశేషాలు ప్రకటించాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ చిత్రంతోనే నాని కెరీర్‌ మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. నాని కెరీర్‌లో వన్నాఫ్‌ ది హిట్స్‌ ‘జెంటిల్‌మన్‌’కి కూడా ఇంద్రగంటినే దర్శకుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతేడాది నాని హీరోగా నటించిన ‘నేను లోకల్, ఎమ్‌సీఏ’ చిత్రాలు ‘దిల్‌’రాజు బ్యానర్‌లో రూపొందాయి. సో.. విడి విడిగా హిట్స్‌ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో ఇప్పుడు జాయింట్‌గా హిట్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top