దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ ప్రమోషనల్‌ సాంగ్‌

Nani Gang Leader Promotional Song Cross One Million Views - Sakshi

జెర్సీతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన నాని.. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం నాని మరో విభిన్న కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. గ్యాంగ్‌ లీడర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది.

నాని.. రచయితగా నటిస్తోన్న ఈ మూవీలో  హీరో కార్తికేయ నెగెటివ్‌ రోల్‌ పోషించడం విశేషం. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, సాంగ్స్‌తో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. నానితో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్‌ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఐదుగురి పాత్రలను వివరిస్తూ సాగిన ఈ పాట.. మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top