నాని, ఇంద్రగంటిల ‘వ్యూహం’

Nani And Indraganti Mohana Krishna Movie Title Vyuham - Sakshi

నేచురల్ స్టార్‌ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని, విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా ఓకె చెప్పాడు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే తన 25వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.

మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు మరో హీరోగా నటించనున్నాడు. నాని జోడిగా అదితిరావ్‌ హైదరీ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వ్యూహం అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top