రేపు తోళా టీజర్ విడుదల | Multi-starrer film teaser tomorrow | Sakshi
Sakshi News home page

రేపు తోళా టీజర్ విడుదల

Feb 19 2016 3:52 AM | Updated on Jul 15 2019 9:21 PM

రేపు తోళా టీజర్  విడుదల - Sakshi

రేపు తోళా టీజర్ విడుదల

ఇప్పుడు చిత్ర టీజర్లకు చాలా ప్రాముఖ్యత ఏర్పడుతోంది. కొత్త చిత్రం ముఖ్యంగా స్టార్స్ చిత్రాల టీజర్లపై యువత అమితాసక్తిని కనబరుస్తున్నారు.

 ఇప్పుడు చిత్ర టీజర్లకు చాలా ప్రాముఖ్యత ఏర్పడుతోంది. కొత్త చిత్రం ముఖ్యంగా స్టార్స్ చిత్రాల టీజర్లపై యువత అమితాసక్తిని కనబరుస్తున్నారు. టీజర్ విడుదలైన గంట, రెండు గంటల్లోనే యూట్యూబ్‌లో వేలాది సంఖ్యలో తిలకిస్తున్నారు. అలాంటి మల్టీస్టారర్ చిత్రం టీజర్ రేపు (శనివారం)విడుదల కానుంది.టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన తోళా(తెలుగులో ఊపిరి) చిత్ర టీజరే అది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటులలో కార్తీ ఒకరని ఇంతకు ముందు ఆయన నటించిన పరుత్తివీరన్, నాన్‌మహాన్ అల్ల లాంటి పలు చిత్రాలే ఉదాహ రణగా పేర్కొనవచ్చు.
 
  ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదయతై తిరుడాదే చిత్రం తరువాత ఆయన నటిస్తున్న తమిళసినిమా తోళా. పైయ్యా, చిరుతై చిత్రాల్లో కార్తీతో జత కట్టిన మిల్కీబ్యూటీ తమన్న ముచ్చటగా మూడో సారి ఆయనతో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇది. ఒక వికలాంగ యువకుడికి, మానసికంగా పెద్ద యుద్ధానికి సిద్ధం అయిన మరో యువకుడికి మధ్య జరిగే పోరాటమే తోళా చిత్రం అంటున్నారు చిత్ర వర్గాలు.

ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమ వర్గాలోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అంతకు ముందుగా శనివారం చిత్ర టీజర్, ఈ నెల 26న చిత్ర ఆడియో విడుదల కానున్నాయి. తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీవీపీ సినిమా భారీ ఎత్తున్న నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న తోళా చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, వివేక్, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement