జిమిక్కి కమ్మల్‌.. ఈ వీడియో చూడాల్సిందే! | Mohanlal Jimmikkal Kammal Dance Video Viral | Sakshi
Sakshi News home page

జిమిక్కి కమ్మల్‌కు మోహన్‌లాల్‌ స్టెప్పులు

Sep 25 2017 10:40 AM | Updated on Sep 25 2017 4:02 PM

Mohanlal Jimmikkal Kammal Dance Video Viral

సాక్షి, సినిమా : జిమిక్కి కమ్మల్‌.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనంగా మారిపోయింది. మాలీవుడ్‌ సీనియర్‌ హీరో మోహన్‌ లాల్‌ నటించిన వెలిపండిటే పుసక్తం చిత్రంలోని ఎంటెమ్మెడె జిమిక్కి కమ్మల్‌ పాట 22 మిలియన్‌ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది. కాలేజీ స్టూడెంట్లు, టెక్కీలు, సెలబ్రిటీలు ఇలా ఎవరూ చూసినా ఈ మాస్‌ పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులేస్తూ తమ తమ వర్షన్‌లను వైరల్‌ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు జిమ్మిక్కల్‌ కమ్మల్‌ డాన్స్‌ ఛాలెంజ్‌ను కూడా విసురుతున్నారు. 

తాజాగా ఆ ఛాలెంజ్‌ను ఎవరు స్వీకరించారో తెలుసా? ఇంకెవరూ ఆ చిత్ర హీరో మోహన్‌లాలే. నిజానికి చిత్రంలో ఆ పాట కాలేజీ విద్యార్థులపై ఉంటుంది. కానీ, సాంగ్‌ చివర్లో మోహన్‌లాల్‌ లెక్చరర్‌గా సైకిల్‌ మీద ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం పాటకు లభిస్తున్న స్పందనతో ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించారు. పాట ఇంత హిట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు. చిత్రంలోని నటీనటులతోనే ఈ పాటను కూడా రూపొందించారు. 

ఇక పాట మధ్యలో మోటర్‌ బైక్‌ మీద వచ్చే మోహన్‌ లాల్‌ పాటకు చిందులేశారు. పంచెకట్టులో 57 ఏళ్ల ఈ కంప్లీట్‌ యాక్టర్‌ స్టెప్పులతో చింపేశారు. ఇప్పటికే ఈ వీడియో 4.5 మిలియన్ల వ్యూవ్స్‌ దాటిపోగా, ఫేస్‌బుక్‌లో 87 వేల మందికి పైగా షేర్‌ చేశారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేస్కోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement