కమాండో బందోబస్త్‌

Mohanlal and Suriya join hands for KV Anand new movie bandhobasth - Sakshi

మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు బందోబస్త్‌ ఏర్పాటు చేశారట హీరో సూర్య. కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. ఇదంతా తమిళ సినిమా ‘కాప్పాన్‌’ గురించే. ‘వీడొక్కడే, బ్రదర్స్‌’ వంటి చిత్రాల తర్వాత సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘కాప్పాన్‌’. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు. సూర్య, సముద్రఖని ఈ సినిమాలో ఎన్‌ఎస్‌జీ కమాండోలుగా నటించారు. మోహన్‌లాల్‌ ప్రధానమంత్రి పాత్రలో నటించారని తెలిసింది. బొమన్‌ ఇరానీ, ఆర్య, నాగినీడు, పూర్ణ తదితరులు నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top