కాంబినేషన్‌ కుదిరెనా?

Mohan Babu in Mani Ratnam's upcoming multi-starrer - Sakshi

ఐదువందల చిత్రాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తన కంటూ ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు నటులు మోహన్‌బాబు. ఇక దర్శకులు మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలకు పెద్ద పెద్ద స్టార్సే అభిమానులుగా ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు వర్క్‌ చేయబోతున్నట్లు తెలిసింది. రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా మణిరత్నం ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్‌బాబును సంప్రదించారట మణిరత్నం. కథ  కూడా నరేట్‌ చేశారని తెలిసింది.    ఈ మల్టీ స్టారర్‌ మూవీ కోసం ఆల్రెడీ సల్మాన్‌ఖాన్, ఐశ్యర్యారాయ్, శింబు వంటి తారలను మణిరత్నం సంప్రదించారనే వార్త వచ్చింది. ఇప్పుడు మోహన్‌బాబును కలవడం ఆసక్తికరమైన అంశం. ఇది ఎవరూ ఊహించని కాంబినేషన్‌. అన్నీ కుదిరితే త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని చెన్నై టాక్‌. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించా లనుకుంటున్నారట. షూటింగ్‌ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకుంటున్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top