పంచ్‌ పడుద్ది 

Model Izabelle in director Jayanth C Paranji Narendra - Sakshi

‘ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ గారూ బాగున్నారా, శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్, లక్ష్మీనరసింహ’ వంటి సూపర్‌హిట్స్‌ అందించిన జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘నరేంద్ర’. నిలేష్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మోడల్‌ ఇజా బెల్లాని హీరోయిన్‌గా ఫిక్స్‌చేశారు. జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ– ‘‘చాంపియన్‌గా ఎదిగిన ఓ బాక్సర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి అయింది.  

కొత్త షెడ్యూల్‌ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్‌ రెజ్లింగ్‌లో భారతదేశం తరపున సత్తా చాటుతున్న స్టార్‌ రెజ్లర్‌ గ్రేట్‌ కాళీ ఈ చిత్రంలో నటిస్తుండం విశేషం. ప్రముఖ బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రామ్‌ సంపత్‌  ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘జయంత్‌గారి వంటి సీనియర్‌ డైరెక్టర్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో చాలెంజింగ్‌ రోల్‌ చేస్తున్నాను. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు ఇజాబెల్లా. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ సంపత్, కెమెరా: వీరేన్‌ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కోయలగుండ్ల, నిర్మాత: ఈషాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top