వీడియో లీకైంది.. నిజం నిగ్గుతేలింది | Meesha Shafi Allegations on Ali, Jam Room Video Leaked | Sakshi
Sakshi News home page

Apr 26 2018 9:45 AM | Updated on Jul 23 2018 8:49 PM

Meesha Shafi Allegations on Ali, Jam Room Video Leaked - Sakshi

మీషాతో అలీ (పాత చిత్రం)

ఇస్లామాబాద్‌ ; నటుడు, సింగర్‌ అలీ జఫర్‌పై లైంగిక ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సింగర్‌ కమ్‌ నటి మీషా షఫీ.. అలీ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ, అందులో అలాంటిదేం జరగకపోవటం విశేషం. 

అలీ తనతో రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని.. ఒకసారైతే ఏకంగా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అందరి ముందే తనపై చేతులు వేశాడని ఆమె ఆరోపించింది. గ్రూప్‌ సభ్యులంతా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ అడ్డుకోలేదని తెలిపింది. అయితే ఆమె చెప్పిన ప్రాక్టీస్‌ సెషన్స్‌ తాలుకూ వీడియోను ఎవరో ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. జామ్‌ రూమ్‌లో వారిద్దరూ బృందంతో ప్రాక్టీస్‌ చేసిన వీడియో. ‘ఇది అలీ నిర్దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యం’ అంటూ ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. 

మేమూ ట్రూప్‌ సభ్యులమేగా... ఇక అలీపై మీషా చేసిన ఆరోపణలపై అలీ బృందంలోని సభ్యులు స్పందించారు. మేమూ ట్రూప్‌లో ఐదేళ్లుగా పని చేస్తున్నామని.. కానీ, అలీ ఏనాడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదని ఇద్దరూ మహిళలు వెల్లడించారు. డబ్బు, పాపులారిటీ కోసమే మీషా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వారంటున్నారు. మరోపక్క పాక్‌ సినీ పరిశ్రమ అలీకి పెద్ద ఎత్తున్న మద్ధతు ఇస్తుండగా.. సింగర్స్‌ అసోషియేషన్‌ మాత్రం మీషా వైపు నిలిచింది. మీషా ఆరోపణలపై అలీ ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించాడు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement