కామాక్షితో కాస్త జాగ్రత్త

meena giorgia andriani karoline kamakshi first look revealed - Sakshi

చట్ట వ్యతిరేక పనులు చేసినా మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఆలోచన ఉంటే అక్కడే ఆగిపోండి. ఎందుకంటే కామాక్షి మీ ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటుంది. ఆమెతో  చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఆమె కామాక్షి.. కరోలిన్‌ కామాక్షి... సీబీఐ ఆఫీసర్‌. మీనా ముఖ్య పాత్రలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘కరోలిన్‌ కామాక్షి’. వివేక్‌ కుమార్‌ కణ్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే మీనా తొలి వెబ్‌ సిరీస్‌. ఇందులో సీబీఐ పాత్రలో కనిపిస్తారామె. ఈ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ను సోమవారం రిలీజ్‌ చేశారు. ఇటాలియన్‌ మోడల్‌ జార్జియా ఆండ్రియాని మరో కథానాయిక.గా నటిస్తున్నారు. అండర్‌ కవర్‌ పోలీస్‌ పాత్రలో ఆండ్రియాని కనిపిస్తారు. జీ5లో ఈ సిరీస్‌ త్వరలో ప్రసారం కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top