నాలోని నటనను బయటకు తీశారు! | Me I was out of work! | Sakshi
Sakshi News home page

నాలోని నటనను బయటకు తీశారు!

Jan 14 2017 2:08 AM | Updated on Sep 27 2018 8:55 PM

నాలోని నటనను బయటకు తీశారు! - Sakshi

నాలోని నటనను బయటకు తీశారు!

నాలో నిగూఢమై ఉన్న నటనను దర్శకుడు పార్తిబన్‌ వెలికి తీసేలా చేశారని నటి పార్వతీనాయర్‌ పేర్కొన్నారు.

నాలో నిగూఢమై ఉన్న నటనను దర్శకుడు పార్తిబన్‌ వెలికి తీసేలా చేశారని నటి పార్వతీనాయర్‌ పేర్కొన్నారు. ఎన్నై అరిందాల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మరో మలయాళీ భామ పార్వతీనాయర్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఈ అమ్మడు ఆనక మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగంలో పేరు సినీరంగం వైపు మళ్లించింది. మిస్‌ కర్ణాటక, మిస్‌ నేవీ క్వీన్‌ కిరీటాలను గెలుచుకున్న పార్వతీనాయర్‌ ఎన్నై అరిందాల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాజాగా పార్తిబన్‌ దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్‌ నిరప్పగా చిత్రంలో నటుడు శాంతనుతో జత కట్టారు. ఈ చిత్రం పొంగల్‌ సందర్భంగా శనివారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా పార్వతీనాయర్‌ ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ కోడిట్ట ఇడంగళ్‌ నిరప్పుగా చిత్రంలో మోహిని అనే మలయాళీ అమ్మాయిగా నటించానని చెప్పారు.

అయితే ఎవరి ఛాయలు లేకుండా ఈ చిత్రంలో నాయకి పాత్రను పోషించానని తెలిపారు. చిత్ర దర్శకుడు పార్తిబన్‌ తనకు ఎంతో నమ్మకం కలిగించి తనలోని నటనను వెలికి తీసేలా చేశారన్నారు. ఎలాంటి రిహార్సల్స్‌ లేకుండా నెల రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. తానిప్పటి వరకూ నటించిన కథా పాత్రల్లోనే కోడిట్ట ఇడంగల్‌ నిరప్పుగా చిత్రంలోని మోహిని పాత్ర ఛాలెంజ్‌తో కూడిందని పేర్కొన్నారు. చిత్ర హీరో శాంతను తనకు పక్క బలంగా నిలిచారని, తమ జంట నటన ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన తరువాత తాను తమిళ అమ్మాయిగా మారిపోయానని అంటున్న పార్వతీనాయర్‌ కోడిట్ట ఇడంగల్‌ నిరప్పుగా చిత్రం అందించే విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement