ఆ రోజే డిస్కో మొదలవుతుంది!

Mass Maharaj's Disco Raja Releasing On 20th December - Sakshi

మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఎక్కడిపోతావు చిన్నవాడా ఫేం విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ్‌ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

డిస్కోరాజా సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్‌ 2న రిలీజ్ చేయనున్నారు. వెన్నెల కిశోర్‌, తాన్యా హోప్‌ ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top