సూపర్‌ స్టార్‌ సోదరి కొత్త ఇన్నింగ్స్‌

Manjula Web Series With Awe Director Prashanth Varma - Sakshi

ఘట్టమనేని వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రొడ్యూస్‌ చేశారు.

ఇటీవల సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల త్వరలో మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్‌ ట్రెండ్‌కు అనుగుణంగా ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌కు అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారక ప్రకటన వెలుడవనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top