క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ | Manchu Laxmi Prasanna Apologize for copied | Sakshi
Sakshi News home page

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ

Dec 10 2016 1:33 PM | Updated on Aug 20 2018 2:50 PM

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ - Sakshi

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ

సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న స్పందిస్తుంటుంది.

సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న  స్పందిస్తుంటుంది. త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఫాలోవర్స్ను ఆకట్టుకుంటోంది. ' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది. తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది.

సినీ రంగంలో వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు తెర మీదకు రావడమే చాలా అరుదు. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ మాత్రం ఈ సాంప్రదాయాలకు మినహాయింపు. కలెక్షన్ కింగ్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన లక్ష్మీ  నటిగానే కాక నిర్మాతగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement