వచ్చేశానోచ్‌

Makers of Prabhas starrer spend 90 crore on action sequence in Dubai - Sakshi

యాహూ... ‘సాహో’ సెట్‌కు వచ్చేశానోచ్‌ అని సంబరపడిపోతున్నారు హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అబుదాబిలో జరుగుతోంది. ఆదివారం ‘సాహో’ సెట్‌లో శ్రద్ధా కపూర్‌ జాయిన్‌ అయ్యారు.

ప్రజెంట్‌ అక్కడ హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బెట్స్‌ సారథ్యంలో యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ‘సాహో’ సెట్‌లో శ్రద్ధా జాయిన్‌ అవుతున్నారంటే.. ఫైట్‌ సీన్స్‌లో ఆమె కూడా ఉంటారని ఊహించవచ్చు. మరి.. శ్రద్ధా ఏవైనా స్టంట్స్‌ చేస్తారా? అన్నది థియేటర్స్‌లో చూడాలి. అరుణ్‌ విజయ్, నీల్‌ నితిన్‌ముఖేష్, ఎవెలిన్‌ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top