మాస్‌ మహేశ్‌

mahesh babu new look on vamshi paidipally movie - Sakshi

మహేశ్‌బాబు ఈసారి కంప్లీట్‌గా కొత్త లుక్‌లోకి మారిపోయారు. గుబురు గడ్డం, పొడవు జుట్టు పెంచేసి మాస్‌ లుక్‌ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న సినిమా కోసమే. వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ డెహ్రాడూన్‌లో ఈ నెల 10న స్టార్ట్‌ కానుంది. ఇందులో కొంత పోర్షన్‌లో కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించనున్నారు మహేశ్‌. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాల్లో మహేశ్‌ కాస్త పొడవు జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు. ఫ్రెండ్‌షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలోని కీలక భాగం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనుంది. ఇందులో మహేశ్‌బాబు ఫ్రెండ్‌గా ‘అల్లరి’ నరేశ్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌.

బావ కోసం...
సుధీర్‌బాబు, అదితీరావ్‌ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఈ నెల 10న జరగనుంది. బావ నటించిన ఈ సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా మహేశ్‌ హాజరు కానున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top