
మహేష్ బాబు
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత‍్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో ఆసక్తికరమైన సినిమాకు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. భరత్ అనే నేను సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు సూపర్ స్టార్ అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించిన సందీప్ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన సమయంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సందీప్ రెడ్డిని అభినందించారు. మహేష్ కూడా ట్వీటర్ ద్వారా సందీప్ రెడ్డి టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను సందీప్ రెడ్డి రెడీ చేశాడట. ఇప్పటికే మహేష్ కు కథ వినిపంచాడన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో మహేష్ బాబు మెకానిక్ పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే వరకు సందీప్ రెడ్డి తో చేయబోయే సినిమాపై మహేష్ టీం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.