భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు ‘మహర్షి’ | Mahesh babu And Vamsi Paidipally At India Vs Australia Match At Oval | Sakshi
Sakshi News home page

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు ‘మహర్షి’

Jun 9 2019 6:15 PM | Updated on Jun 9 2019 7:19 PM

Mahesh babu And Vamsi Paidipally At India Vs Australia Match At Oval - Sakshi

ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. మహర్షి చిత్రం విజయవంతం కావడంతో ప్రస్తుతం వరల్డ్‌ టూర్‌లో ఉన్న మహేష్‌ బాబు ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లను వీక్షించేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లారు. క్రికెట్‌లో రెండు దిగ్గజ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌పైనే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై వుంది. 

గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌ కుటుంబం.. వంశీ పైడిపల్లి ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ.. సోషల్‌ మీడియాలో​ ఫోటోలను షేర్‌చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సెలబ్రేటింగ్‌ మహర్షి అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement