కాలేజ్‌కి కొంచెం ఆలస్యంగా..

Mahesh Babu And Vamshi Paidipally Delay For Shoot - Sakshi

జనరల్‌గా జూన్‌ సెకండ్‌ వీక్‌లోగా కొన్ని కాలేజ్‌లు స్టార్ట్‌ అవుతాయి. కొన్నిసార్లు ఒకవారం ఆలస్యంగా కూడా స్టార్ట్‌ కావచ్చు. ప్రస్తుతం మహేశ్‌బాబు జాయిన్‌ అయిన కాలేజ్‌ కూడా ఒక వారం లేట్‌గా స్టార్ట్‌ కానుందట. మహేశ్‌బాబు కాలేజ్‌లో జాయిన్‌ అవ్వడమేంటీ? అంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా కోసం మహేశ్‌ స్టూడెంట్‌గా మారిపోయి, డెహ్రాడూన్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్లపై అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.

మహేశ్‌కి బ్రదర్‌గా ‘అల్లరి’ నరేశ్‌ నటించనున్నారు. మొదట ఈ సినిమా షెడ్యూల్‌ జూన్‌ 10న స్టార్ట్‌ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పుడు జూన్‌ 17న స్టార్ట్‌ కానుందట. డెహ్రాడూన్‌ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ మూడు రోజులు షూటింగ్‌ జరిపి, 21 నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కి షిఫ్ట్‌ అవుతారట చిత్రబృందం. మరి.. అది హైదరాబాద్‌ కాలేజా? డెహ్రాడూనా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేశ్‌ ఎం.బి.ఎ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. ఆ పోర్షన్‌ కోసమే మహేశ్‌ గడ్డం పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top