
మహేశ్‌బాబు
కాలేజీలో జాయిన్ అవ్వడానికి డెహ్రాడూన్ వెళ్లారు హీరో మహేశ్‌బాబు. ఆశ్చర్యపోకండి. ఇది ఆయన నటించనున్న కొత్త సినిమా కోసం అండీ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో మహేశ్‌బాబు పాల్గొంటారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ కోసం మహేశ్ ఆల్రెడీ గడ్డం, మీసాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భాగంగా మొదట కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. యూ.ఎస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని సమాచారమ్. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.