కరాచీలో మడోన్నా బడి.. | Madonna, queen of pop, opens school in Karachi | Sakshi
Sakshi News home page

కరాచీలో మడోన్నా బడి..

Oct 1 2014 9:01 AM | Updated on Sep 2 2017 2:11 PM

కరాచీలో మడోన్నా బడి..

కరాచీలో మడోన్నా బడి..

పాప్ రారాణి మడోన్నా పాకిస్థాన్‌లోని కరాచీ నగర శివార్లలో ఒక స్కూలు ప్రారంభించింది. ‘డ్రీమ్ మోడల్ స్ట్రీట్ స్కూల్’ పేరిట ఇటీవల ప్రారంభించిన

పాప్ రారాణి మడోన్నా పాటలు పాడటమే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఆమె పాకిస్థాన్‌లోని కరాచీ నగర శివార్లలో ఒక స్కూలు ప్రారంభించింది. ‘డ్రీమ్ మోడల్ స్ట్రీట్ స్కూల్’ పేరిట ఇటీవల ప్రారంభించిన ఈ స్కూలులో ఇప్పటికే దాదాపు1200 మంది విద్యార్థులు చేరినట్లు మడోన్నా తన ‘ట్విట్టర్’ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు వగైరా అధునాతన హంగులతో కూడిన ఈ స్కూల్ ఫొటోలను ఆమె ‘ట్విట్టర్’లో షేర్ చేసింది. కరాచీలో స్కూలు ప్రారంభించనున్నట్లు మడోన్నా ఏడాది కిందటే ప్రకటించింది. అన్నట్లుగానే స్కూలు తెరిచి, అమ్మాయిలకు విద్యావకాశాలు పెంపొందించేందుకు తనవంతు సాయం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement