‘సిరివెన్నెల’ పాటకు లెజెండరీ సింగర్స్‌ ప్రశంసలు

Legendry Singers Praised Sirivenella Movie Song - Sakshi

పెళ్ళి త‌రువాత ప్రముఖ న‌టి ప్రియ‌మ‌ణి న‌టిస్తున్న చిత్రం సిరివెన్నెల‌. శాంతి టెలిఫిల్మ్స్ స‌మ‌ర్పణ‌లో ఎ.ఎన్‌.బి కొఆర్డినేట‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుని ప్రస్తుతం పొస్ట్‌ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుటుంది. ప్రకాష్ పులిజాల ద‌ర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతాలు సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రానికి సంబందించిన టీజ‌ర్‌ని ఇటీవ‌లే బాలీవుడ్ స్టార్ డైర‌క్టర్ నీర‌జ్ పాండే చేతుల మీదుగా విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు  క‌మ్రాన్ సంగీతం అందించిన పాటను క్రేజీ సంగీత ద‌ర్శకుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ త‌న సోష‌ల్‌మీడియా ద్వారా లాంచ్ చేశారు. ఆయ‌న విడుద‌ల చేసిన సాంగ్‌కి లెజండ‌రి సింగ‌ర్స్ ఎస్‌.పి.బాల‌సుబ్రమ‌ణ్యం , శంక‌ర్ మ‌హ‌దేవ్‌లు ప్రశంసలు కురిపించారు.

ఈ సంద‌ర్బంగా ఎస్‌.పి.బాల‌సుబ్రమ‌ణ్యం మాట్లాడుతూ.. సంగీత ప్రియులంద‌రికి న‌మస్కారాలు.. ఇప్పుడే ఒకే పాట వున్నాను. శాంతి టెలిఫిల్మ్స్ స‌మ‌ర్పణ లో ఎ.ఎన్.బి కొఆర్డినేట‌ర్స్ నిర్మిస్తున్న సినిమా సిరివెన్నెల సినిమాలోనిది. మా బాషా, క‌మ‌ల్ బోరా సంయుక్తంగా నిర్మించారు. జై జై గ‌ణేషా అనే పాట చాలా చ‌క్కగా వుంది. ముఖ్యంగా పాత సిరివెన్నెల నాకు చాలా ఇష్టమైన సినిమా.. అలాగే ఈ సినిమా కూడా అంతే విజ‌యాన్ని అందుకోవాల‌ని కొరుకుంటున్నాను.

అలాగే ఈ సాంగ్ పాడిన ప్రణ‌తి రావు చాలా చాలా బాగా పాడింది.. చివ‌ర‌లో వాయిస్ క‌లిపిన రాంసి, హ‌రిగుంట‌.. సాహిత్యాన్ని అందించిన శ్రీరామ్ త‌ప‌స్వికి సంగీతం అందించిన  క‌మ్రాన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చ‌క్కటి తెలుగు ప‌దాల‌తో తెలుగు పాట‌, అందులోను గ‌ణేశ నామ‌ స్మర‌ణ‌తో మొద‌ల‌య్యిన ఈ పాట సినిమా విజ‌యానికి నాంది కావాల‌ని కొరుకుంటున్నాను. అంద‌రూ బాగుండాలి స‌ర్వేజ‌నా సుఖినో భ‌వంతు’ అన్నారు.

శంక‌ర్ మ‌హ‌దేవ్ మాట్లాడుతూ.. ‘జై జై గ‌ణేశ అనే మొద‌ల‌య్యే ఈ పాట చాలా బాగుంది. నిర్మాత బాషా గారు నిర్మించిన సిరివెన్నెల చిత్రం నుండి మెద‌టి సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్, ఈ సాంగ్ విజ‌యం సాధించాలి. అలాగే సినిమా కూడా చాలా మంచి విజ‌యాన్ని అందుకొవాల‌నికి కొరుకుంటున్నాను’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top