పోలీసుల వైఖరితో మనోవేదనకు గురయ్యా: నటి

Law and Order Missing in Tamil Nadu Said Actress Meera Mithun - Sakshi

చెన్నై, టీ.నగర్‌: తమినాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినట్లు నటి మీరా మిథున్‌ అన్నారు. తానా సేంద కూట్టం వంటి చిత్రాల్లో నటించారు మీరామిథున్‌. మోడల్‌ అయిన ఈమె బ్యూటీ కాంటెస్ట్‌లో గెలుపొంది అవార్డును అందుకున్నారు. తర్వాత అనేక వివాదాల కారణంగా అవార్డు ఉపసంహరించుకోబడింది. మొదట్లో అందాల పోటీలు జరపనున్నట్లు తెలిపి పలువురు మహిళల వద్ద నగదు మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు అందజేసిన మిస్‌ సౌత్‌ ఇండియా బ్యూటీ అవార్డు వెనక్కి తీసుకున్నారు.

బిగ్‌బాస్‌ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దీని ద్వారా చేరన్‌పై పరువునష్టం ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఆమెను తొలగించారు. ఆమెపై హత్యా బెదిరింపుల కేసు కూడా నమోదైంది. మీరామిథున్‌ ప్రస్తుతం పోలీసు శాఖపై ట్విటర్‌లో విమర్శలు చేశారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఉక్కు మహిళ మృతి తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. చదువుకున్నవారు రాష్ట్రాన్ని పాలించాలని, రాజకీయనేతగా ఉండేందుకు ఇదే పెద్ద అర్హతన్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై సీఎం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు, అవినీతి పెచ్చుమీరాయన్నారు. తమిళనాడు పోలీసులు క్రిమినల్స్‌తో స్నేహం చేస్తున్నారని, తన ఫిర్యాదులపై కమిషనర్‌ సహా ఏ పోలీసు అధికారి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పోలీసుల వైఖరితో మనోవేదనకు గురైనట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top