అక్క ఎక్కడ?

Kriti Sanon and Sonakshi Sinha to play sisters in Vishal Bhardwaj’s next? - Sakshi

కృతీ సనన్‌కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్‌ సనన్‌. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్‌ స్క్రీన్‌ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో త్వరగా చెప్పండి.

తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ను సతాయిస్తున్నారట కృతి. ‘‘సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, వాణీ కపూర్, భూమి పెడ్నేకర్‌ని సంప్రదించాను. ఇంకొన్ని పేర్లు అనుకుంటున్నాను. మీ అక్కయ్యను త్వరలోనే ఫైనలైజ్‌ చేస్తా’’ అని కృతీ సనన్‌ను బుజ్జగిస్తున్నారట విశాల్‌. అక్కాచెల్లెళ్ల గొడవలను బేస్‌ చేసుకుని బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌. హిందీలో ‘హైదర్, రంగూన్‌’ వంటి చిత్రాలను రూపొందించారాయన. తన తాజా చిత్రంలో చెల్లెలి పాత్రకు కృతీ సనన్‌ ఓకే చేశారు. మరి.. కృతి అక్క ఎవరో వేచి చూద్దాం.

Back to Top