‘భారతీయ సినిమా పరిశ్రమకు షాక్‌’ | Krishnam Raju, Krishna offer condolences to Sridevi | Sakshi
Sakshi News home page

‘భారతీయ సినిమా పరిశ్రమకు షాక్‌’

Feb 25 2018 11:24 AM | Updated on Aug 28 2018 4:32 PM

Krishnam Raju, Krishna offer condolences to Sridevi - Sakshi

కృష్ణంరాజు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటీమణి శ్రీదేవి మరణం భారతీయ సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసిందని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. శ్రీదేవి పోషించిన పాత్రల్లో ఎవరూ చేయలేనంత గొప్పగా నటించిందని కొనియాడారు. సినిమా సెట్‌లో ఆమె చాలా హుందాగా, గౌరవంగా వ్యవహరించేదని గుర్తు చేసుకున్నారు. భానుమతి, సావిత్రి మినహాయిస్తే ఆమెతో పోల్చదగిన నటులు ఎవరూ లేరని పేర్కొన్నారు. కూతుళ్ల భవిష్యత్‌ చూడకుండా ఆమె వెళ్లిపోవడం దురదృష్టకరమని, శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మా ఇంట్లో ఎదిగిన పిల్ల: కృష్ణ
శ్రీదేవి మరణం పట్ల సూపర్‌స్టార్‌ కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త వినగానే భూకంపం వచ్చినట్టు కంపించిపోయానని తెలిపారు. తనతోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసిందని గుర్తు చేసుకున్నారు. నరేశ్‌, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులని చెప్పారు. శ్రీదేవి తమ ఇంట్లో ఎదిగిన పిల్ల అని, చెన్నైలో తమవి పక్కపక్క ఇళ్లు అని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement