మిమిక్రీ షోలకు దూరంగా..

Komali SIsters Special Chit Chat With Sakshi

 హైదరాబాద్‌లో ఫుల్‌ ఫ్రీడం

యువ నటి కోమలి హిరోషిని

సాక్షి, హైదరాబాద్‌: మాటల్లో చాతుర్యం. మిమిక్రీతో హాస్యంతో అలరించి.. డైలాగ్‌ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్‌ అందరికీ సుపరిచితమే. చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి. హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్‌ అంటూ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడింది.  

ఖమ్మంలో పుట్టినా..
నేను, చెల్లి పుట్టింది ఖమ్మంలోనే అయినా నా రెండో యేట నుంచే హైదరాబాద్‌లో పెరిగాను. కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని. ఇద్దరం కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. చిన్నప్పటినుంచే మేం మిమిక్రీలు, ప్రోగ్రామ్స్‌తో అలరిస్తున్నాం. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ఇచ్చాం. ప్రస్తుతం నేను యూసుఫ్‌గూడ సెయింట్‌ మెరీస్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం ఫైనలియర్‌ చదువుతున్నాను. హైదరాబాద్‌లో ఫుల్‌ ఫ్రీడమ్‌ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్‌కు వచ్చేంతవరకు నా మనసు ఊరుకోదు.

మిమిక్రీ షోలకు దూరంగా..
కొత్త హిరోషిని కోమలిగా దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను. చివరగా త్రివిక్రమ్‌ చిత్రం ‘అ ఆ’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను. థియేటర్‌ వర్క్‌షాప్‌లో సత్యానంద్‌ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా... డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన. ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్‌ గిర్‌ స్టీల్‌ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్నాను. రకుల్, రానా, అంజలి, రవితేజ లాంటి వారు ఇక్కడ ట్రైనింగ్‌ తీసుకుంటారు. పుడ్, వ్యాయాయం, యోగాలతో పాటు వర్కవుట్‌లకు అధిక ప్రాధాన్యమిచ్చాను. రెగ్యులర్‌ పాత్రల కన్నా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలని ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top