రాకింగ్‌ స్టార్‌తో ప్రభాస్‌..! | KGF Star Yash Spotted With Young Rebal Star Prabhas | Sakshi
Sakshi News home page

Dec 8 2018 2:17 PM | Updated on Dec 8 2018 2:23 PM

KGF Star Yash Spotted With Young Rebal Star Prabhas - Sakshi

బాహుబలి 2 రిలీజ్‌ తరువాత ప్రభాస్‌ పబ్లిక్‌ ఈవెంట్స్‌లో చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఎక్కువగా విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. అయితే తాజాగా మరో హీరోతో కలిసి ప్రభాస్‌ ముంబైలో సందడి చేశాడు. త్వరలో కేజీఎఫ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కన్నడ హీరో యష్‌.

ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా హిందీ వర్షన్ ప్రమోషన్ల కోసం యష్ ముంబైలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ముంబైలో ఉన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. యష్‌ కోరిక మేరకు డిన్నర్‌ పార్టీకి హజరైన ప్రభాస్‌.. యష్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement