అమ్మ జోక్యం చేసుకోకపోయినా.. | Keerthy Suresh to Romance Ilayathalapathy in Vijay 60 | Sakshi
Sakshi News home page

అమ్మ జోక్యం చేసుకోకపోయినా..

Jul 24 2016 1:45 AM | Updated on Sep 4 2017 5:54 AM

అమ్మ జోక్యం చేసుకోకపోయినా..

అమ్మ జోక్యం చేసుకోకపోయినా..

అమ్మ జోక్యం చేసుకోదు అయినా అన్ని విషయాలు అమ్మకు చెబుతాను అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. ఇటీవల కాలంలో కోలీవుడ్‌లో

అమ్మ జోక్యం చేసుకోదు అయినా అన్ని విషయాలు అమ్మకు చెబుతాను అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. ఇటీవల కాలంలో కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కీర్తీసురేశ్. రజనీమురుగన్ చిత్రంతో అనూహ్యంగా పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ కేరళ కుట్టి తాజాగా ఇళయదళపతితో రొమాన్స్ చేసే బంపర్ ఆఫర్‌ను కొట్టేశారు. విజయ్‌తో నటించే అవకాశం వస్తుందని అసలు ఊహించలేదంటున్న కీర్తీసురేశ్ ఏమంటున్నారో చూద్దాం.

 తన తల్లి మేనక నటి కావడంతో తనకు చిన్న వయసు నుంచి నటనపై ఆసక్తి, నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదన్నారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించానని తెలిపారు.ఆ తరువాత గీతాంజలి అనే మలయాళ చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యానన్నారు. విశేషం ఏమిటంటే తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేశానని చెప్పారు. ఇక తమిళంలో ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా పరిచయం అయ్యానని తెలిపారు. రజనీమురుగన్ చిత్రం తరువాత శివకార్తికేయన్‌కు జంటగా రెండో సారి రెమో చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.

 బాబిసింహా సరసన పాంబుసండై, విజయ్‌కు జంటగా ఆయన 60వ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ధనుష్‌తో కలిసి నటించిన తొడరి చిత్రం ఆగస్ట్ 15న తెరపైకి రానుందని చెప్పారు. విజయ్‌కు జంటగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. తమిళంలో ఏకకాలంలో పలు చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే కాల్‌షీట్స్ సమస్య రాకండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. అమ్మ తన విషయంలో జోక్యం చేసుకోరని చెప్పారు. తను సీనియర్ నటి అయినందువల్ల అన్నీ అర్థం చేసుకుంటారని, అయినా అన్ని విషయాలు అమ్మతో పంచుకుంటానని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement