మీ కోసం ఇంకా కష్టపడతా

Kavacham Audio Launch In Bhimavaram - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌  

‘‘కవచం’ ఫంక్షన్‌కి వచ్చిన భీమవరం ప్రజలకు చాలా థ్యాంక్స్‌. నాతో ఇంత మంచి సినిమా చేసిన  శ్రీనివాస్‌గారికి, ఇంత మంచి కథను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిన చోటాగారికి, మిగతా టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అన్నారు. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. మెహరీన్, బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, హర్షవర్థన్‌ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. నవీన్‌ సొంటినేని (నాని) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది.

తమన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను భీమవరంలో విడుదల చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘కవచం’ అవుట్‌పుట్‌ బాగా రావడానికి కారణమైన నవీన్‌గారికి  చాలా థ్యాంక్స్‌. నన్ను నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను. ప్రేక్షకుల ప్రేమ, నమ్మకం కోసం ఇంకా కష్టపడతాను’’ అన్నారు. ‘‘కవచం’ మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్‌ సొంటినేని. ‘‘సాయితో పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఈ సినిమాకి కుదిరింది.

బెల్లంకొండ సురేశ్‌గారితో ఆరు సినిమాలు చేశాను.. అన్నీ హిట్‌. ఈ సినిమా వాటికన్నా పెద్ద హిట్‌ కావాలి’’ అని తమన్‌ అన్నారు. ‘‘ఈ సినిమాకి సాయి శ్రీనివాస్‌గారు ఇచ్చిన సహకారం గొప్పది. కాజల్‌ బాగా నటించారు’’ అన్నారు శ్రీనివాస్‌ మామిళ్ళ. ‘‘ప్రేక్షకుల సపోర్ట్‌ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. ‘‘శ్రీనివాస్‌ మామిళ్ళగారితో నా కెరీర్‌ మొదలైంది. ఆయన కో డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి కలిసి పని చేస్తున్నాను. కాజల్‌ ఈ రేంజ్‌లో ఉండటానికి కారణం తన పనే. సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్స్‌లో ఎన్టీఆర్‌ తర్వాత సాయి శ్రీనివాస్‌ని చూశా’’ అన్నారు కెమెరామెన్‌ చోటా కె. నాయుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top