రొంబ బిజీ! | Karthi's next film directed by Pandiraj kickstarts | Sakshi
Sakshi News home page

రొంబ బిజీ!

Nov 10 2017 1:21 AM | Updated on Nov 10 2017 4:05 PM

Karthi's next film directed by Pandiraj kickstarts - Sakshi

అవును... సాయేషా సైగల్‌ రుంబ బిజీ. రొంబ అంటే... తమిళంలో చాలా అని అర్థం. ‘అఖిల్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మీద కోలీవుడ్‌వారి కన్నుపడింది. అంతే.. అక్కణ్ణుంచి ఆఫర్లు మొదలయ్యాయి. అందుకే ‘రొంబ’ అన్నాం. ఇప్పటికే అక్కడ ‘వనమగన్‌’ అనే సినిమా చేశారామె. ఇప్పుడు ‘జంగా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా మరో తమిళ సినిమా చేస్తున్నారు.

ప్రస్తుతం ఇంకో చాన్స్‌. కార్తీ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సాయేషాని అడిగారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందనుంది. చెన్నైలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ 17న ‘ఖాకి’ ద్వారా రానున్న కార్తీ ఆల్రెడీ ఈ విలేజ్‌ లవ్‌స్టోరీ కోసం రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement