హాలీవుడ్‌కి ఆయన కరెక్ట్! | Kareena Kapoor says her husband Saif ali khan suitable to Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కి ఆయన కరెక్ట్!

Feb 19 2014 12:03 AM | Updated on Sep 2 2017 3:50 AM

హాలీవుడ్‌కి ఆయన కరెక్ట్!

హాలీవుడ్‌కి ఆయన కరెక్ట్!

బాలీవుడ్ భామ కరీనా కపూర్.... తన భర్త సైఫ్ అలీఖాన్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఈ సందర్భంలోనే... హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలని సైఫ్‌కి సూచించారు కరీనా.

బాలీవుడ్ భామ కరీనా కపూర్.... తన భర్త సైఫ్ అలీఖాన్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఈ సందర్భంలోనే... హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలని సైఫ్‌కి సూచించారు కరీనా. హాలీవుడ్ చిత్రాలకు సైఫ్ కచ్చితంగా సరిపోతారని, ఈ మధ్యకాలంలో వ్యక్తిగా, నటుడిగా సైఫ్ పరిపూర్ణతను సాధించారని కరీనా కితాబిచ్చారు. అద్భుతమైన టాలెంట్, లుక్, బాడీలాంగ్వేజ్ సైఫ్ సొంతమని, హాలీవుడ్‌లో విజయవంతంగా రాణించగల సత్తా సైఫ్‌కుందని కరీనా అభిప్రాయపడ్డారు. హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆసక్తి తనకైతే లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా కరీనా చెప్పారు. బాలీవుడ్‌లోనే సంతృప్తి ఉందని, ఇక్కడకు ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా తన స్థానానికి ఎలాంటి ఢోకా లేదని కరీనా వ్యాఖ్యానించారు. ప్రతిభ ఉన్నవారికే బాలీవుడ్‌లో సుదీర్ఘమైన కెరీర్ ఉంటుందని, కొత్త తరం హీరోయిన్లలో హ్యూమా ఖురేషి, మహీగిల్‌లు అద్భుతంగా రాణిస్తున్నారని కరీనాకపూర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement