మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

Kajal Aggarwal to Turn Producer with Prashanth Varma Directorial - Sakshi

అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ కల్కి సినిమాతోనూ తన ఇమేజ్‌ను కాపాడుకున్నాడు. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని కూడా రెడీ చేశాడన్న టాక్‌ వినిపిస్తోంది. తొలి రెండు చిత్రాలను ప్రయోగాత్మక కథలతో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా కోసం లేడీ ఓరియంటెడ్‌ కథను సిద్ధం చేశాడు.

ఈ సినిమాలోనూ తన తొలి చిత్ర కథానాయకి కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అంతేకాదు సినిమాను తమన్నాతో కలిసి కాజల్‌ స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నారట. చాలా కాలంగా నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాజల్‌ ఈ సినిమాతో తన ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top