ప్యారిస్‌ ప్యారిస్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల | kajal Agarwal Paris Paris First Look Release | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ప్యారిస్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

Oct 22 2018 10:38 AM | Updated on Oct 30 2018 6:01 PM

kajal Agarwal Paris Paris First Look Release - Sakshi

ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రంలో కాజల్‌

సినిమా:  ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశాయి. హిందిలో కంగనారనౌత్‌ నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం క్వీన్‌కు రీమేక్‌ ప్యారిస్‌ ప్యారిస్‌. బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాదిలోని నాలుగు భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. తమిళంలో ప్యారిస్‌ ప్యారిస్‌ పేరుతో తెరకెక్కుతున్న ఇందులో కంగనారనౌత్‌ పాత్రలో నటి కాజల్‌అగర్వాల్‌ నటిస్తోంది. కన్నడ నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. దీంతో ఈ చిత్రం గురించే సినీ వర్గాలు మరచిపోయారనే చెప్పవచ్చు. దీంతో మరీ ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందనే ఏమోగానీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసి ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం ఒకటుందన్న విషయాన్ని చిత్ర యూనిట్‌ గుర్తు చేసినట్లుంది. అయితే చిత్ర ఫస్ట్‌లుక్‌కు మాత్రం మంచి స్పందన లభిస్తోంది.

నటి కాజల్‌ అగర్వాల్‌ ప్యారిస్‌ నగర అందాలను ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇందులో కాజల్‌ పరమేశ్వరి అనే పాత్రలో నటిస్తోంది. ఈమె ప్యారిస్‌ ఎందుకు వెళుతుందన్నదే చిత్ర ప్రధానాంశం. బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తమిళచ్చి తంగపాండియన్‌ మాటలను అందించడం విశేషం. ఇదే చిత్రం తెలుగు రీమేక్‌లో నటి తమన్నా నటిస్తోంది. దటీజ్‌ మహాలక్ష్మీ పేరుతో తెలుగులోనూ సమ్‌ సమ్‌ పేరుతో మలయాళంలోనూ తెరకెక్కుతోంది. మలయాళంలో మంజిమామోహన్‌ నటిస్తోంది. ఇక కన్నడంలో బటర్‌ప్‌లై పేరుతో పరుల్‌ యాదవ్‌ హీరోయిన్‌గా రూపొందుతోంది. దీంతో ఈ నాలుగు భాషల్లోనూ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement