
చందమామకు కలిసిరాని వేసవి
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్కు ఈ ఏడాది వేసవి పెద్దగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలతో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెండు భారీ చిత్రాలు నిరాశపరచడంతో అమ్మడి కెరీర్ కూడా...
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్కు ఈ ఏడాది వేసవి పెద్దగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలతో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెండు భారీ చిత్రాలు నిరాశపరచడంతో అమ్మడి కెరీర్ కూడా కష్టాల్లో పడింది. అసలే సినిమాలు లేని సమయంలో.., రెండు పెద్ద సినిమాల్లో అవకాశం రావడంతో ఇక మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే అని భావించింది ఈ బ్యూటీ, కానీ ఫలితాలు నిరాశపరచటంతో తిరిగి ఆలోచనలో పడింది.
కాజల్, తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన సినిమా సర్దార్ గబ్బర్సింగ్. ఏప్రిల్ 8న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో రాకుమారి పాత్రలో కనిపించింది కాజల్. ఈ సినిమాతో తనకు మరో బ్రేక్ వస్తుందని ఆశించిన కాజల్కు నిరాశే మిగిలింది. సర్దార్ గబ్బర్సింగ్ ఆశించిన స్థాయి విజయం సాధించలేక అభిమానులతో పాటు కాజల్ అగర్వాల్ను నిరాశపరిచింది.
భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందీ చందమామ. బిజినెస్మేన్ లాంటి హిట్ తరువాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తుండటం కలిసొస్తుందని భావించింది. కానీ బ్రహ్మోత్సవం సినిమా కూడా కాజల్ ఆశలను నిజం చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఏ మాత్రం అలరించలేకపోయింది.
ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటి. తనను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజనే మరోసారి తన కెరీర్ ను గాడిలో పెడతాడన్న ఆశతో ఈ సినిమా చేస్తోంది కాజల్.