ఓటీటీలో కాజల్‌ చిత్రం

Kajal Agarwal Film Is All Set To Release On OTT - Sakshi

నటి కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటించిన చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం. కొన్ని సమస్యల వల్ల విధులకు నోచుకోని చిత్రాలకు కరోనా కాలం కలిసొస్తుందా అంటే కచ్చితంగా అవుననే చెప్పవచ్చు. స్టార్‌ హీరోల చిత్రాలకు కరోనా ఆటంకంగా మారినా, చిన్న చిత్రాలకు, ఇప్పటికే నిర్మాణం కార్యక్రమాలు పూర్తి చేసుకొని కొన్ని సమస్యల కారణంగా విడుదలకు నోచుకోని పెద్ద చిత్రాలకు కరోనా కాలం కలసి వచ్చిందనే చెప్పాలి. అలాంటి చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా విడుదలకు వరుస కడుతున్నాయి. చాలాకాలం క్రితమే నిర్మాణ కారక్రమాలను పూర్తి చేసుకున్న నాలుగు నలుగురు స్టార్‌ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం తాజాగా ఓటీటీ ప్లాట్‌ ఫాంలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (టైమ్‌ ఫిక్స్‌)

హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్‌. నటి కంగనా రనౌత్‌ నటించిన ఆ లేడీ ఓరిఎంటెడ్‌ చిత్రం 2013లో విడుదలయింది. ఆ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం మొదలగు దక్షిణాది భాషల్లో రీమేక్‌ చేశారు. తమిళంలో ప్యారిస్‌ పేరుతో రూపొందిన ఈ చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన భూమికను పోషించారు. అదేవిధంగా తెలుగులో తమన్నా నటించగా దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇకపోతే మలయాళంలో మంజిమా మోహన్‌ ప్రధాన పాత్రల్లో జామ్‌జామ్‌ పేరుతోను, కన్నడంలో పరుల్‌ యాదవ్‌ నటించగా బటర్‌ ప్లై పేరుతోనూ రూపొందింది. ఇలా నాలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆది నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కుంటూనే వచ్చింది. నిర్మాణంలో జాప్యం జరిగింది. చివరికి సెన్సార్‌ విషయంలోనూ సమస్యలను ఎదుర్కొంది. (హిందీ హెలెన్‌!)

ఇక్కడ సెన్సార్‌ బోర్డు పలు కట్స్‌ ఇవ్వడంతో రివైజింగ్‌ కమిటీకి వెళ్లింది. అలా అక్కడ సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ప్యారిస్‌ చిత్ర ట్రైలర్‌ను గత ఏడాదిన్నరం క్రితం విడుదల చేశారు. ఇప్పటికీ ఏ భాషలోనూ ఈ చిత్రం తెరపైకి రాలేదు. అలాంటిది ఇప్పుడు దీనికి ఓటీటీ శరణ్యం అయినట్టు తాజా సమాచారం. కాగా నటి కాజల్‌ అగర్వాల్‌ నటించిన తొలి లేడీ ఓరిఎంటెడ్‌ చిత్రం ఇది. ఆమె ఆశలు పెట్టుకుంది. అలాంటిది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య సందడి చేయలేని పరిస్థితి. త్వరలో నాలుగు భాషల్లోనూ ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top