‘కాలా’ టీజర్‌లో ధోని.. | Kaala Teaser, CSK team Version Glaring | Sakshi
Sakshi News home page

Mar 29 2018 8:00 PM | Updated on Mar 29 2018 9:28 PM

Kaala Teaser, CSK team Version Glaring - Sakshi

కాలా టీజర్లో క్రికెటర్ల హంగామా

సాక్షి, చైన్నై:  సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ హీరోగా కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాలా’ సినిమా ఫీవర్‌ దక్షిణాదిలో సినీప్రియులకు ఎంతలా సోకిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను విడుదలైన 24 గంటల్లోనే కోటి ఇరవై లక్షల మంది వీక్షించారు. దీన్ని బట్టి తెలుస్తుంది కాలా ప్రభంజనం. అయితే తాజాగా క్రికెటర్లూ రజనీ ‘కాలా’ టీజర్‌కు ఫిదా అయిపోయారు.  ఈ సినిమా ట్రైలర్‌ను స్పూఫ్‌ చేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు (సీఎస్‌కే) రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది.

సీఎస్‌కే టీజర్‌లో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ‘కాలా’ అదేం పేర్రా..! అంటాడు. వెంటనే ఓపెనర్‌ విజయ్‌ కాలా అంటే కరికాలుడు..చావుకే దడ పుట్టించేవాడు అనే డైలాగ్‌ విసురుతాడు. వెస్టిండీస్‌ ప్లేయర్‌ డ్వేన్‌ బ్రావో కాలా అంటే కాపాడేవాడు.. నమ్మిన వాళ్లను గొడవ పడైనా కాపాడతాడు అంటూ విజయ్‌ని అనుసరిస్తాడు. టీజర్‌ చివర్లో.. టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ‘ఏం రా సెట్టింగా’  అంటూ రజనీ స్టైల్‌లో చెప్తాడు.

చివర్లో మళ్లీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడు చూళ్లేదు కదూ... ఇప్పుడు చూపిస్తా అని విలన్లను రఫ్పాడిస్తాడు. ఇలా కాలా టీజర్లో సీఎస్‌కే క్రికెటర్లు హంగామా చేశారు. ఒక పక్క ‘కాలా’ సినిమా టీజర్‌ను చూసి రజనీ అభిమానులు ఎంజాయ్‌ చేస్తుండగా.. మరోపక్క సీఎస్‌కే జట్టు ఈ సినిమా టీజర్‌ని తన వెర్షన్‌లో చూపించి అటు సినిమా ఇటు క్రికెట్‌ అభిమానులని ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement