కాలా చిత్ర వ్యవహారంలో రజనీకాంత్‌ను కోర్టు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
చెన్నై: కాలా చిత్ర వ్యవహారంలో రజనీకాంత్‌ను కోర్టు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలా చిత్ర కథ, టైటిల్ తనవే అంటూ చెన్నైకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వివాదానికి తెరలేపారు.ఈ విషయమై హైకోర్టు రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్, నిర్మాత ధనుష్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి, వారు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆ పిటిషన్లలో కాలా చిత్ర కథ తమదేనని, అసలు రాజశేఖర్ ఎవరో రజనీకాంత్‌కు తెలియదని, ప్రచారం కోసమే అతడు ఈ చర్యలకు పాల్పడినట్లు వివరణ ఇచ్చారు. కాగా ఈ కేసు నిన్న (బుధవారం) కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడి తరఫున హాజరైన న్యాయవాది రజనీకాంత్ బదులు పిటిషన్‌లో రాజశేఖర్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారని, అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించడానికి గడువు తమకు కావాలని కోరారు. దీంతో ఈ కేసును న్యాయమూర్తి ఆగస్టు మూడవ తేదీకీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
rajinikanth, kaala, dhanush, madras high court, రజనీకాంత్, కాలా, ధనుష్, మద్రాసు హైకోర్టు