కథగా కేర ళ ట్రాజెడీ

Jude Anthany's '2403 ft' to pay tribute to flood heroes - Sakshi

మొన్నే వచ్చిన కేరళ వరదల విషాదం నుంచి కేరళ ఇంకా కోలుకోలేదు. ఆ వరదలను ఎదుర్కోడానికి ఒక్క తాటిపై నిలిచారు కేరళ వాసులు. ఈ ప్రకృతి బీభత్సాన్ని విజువల్‌గా చూపించడనికి సిద్ధమయ్యారు మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంటొనీ జోసెఫ్‌. ‘2043 ఫీట్‌’ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా తీయడానికి గల కారణాలను దర్శకుడు వివరిస్తూ– ‘‘ఈ వరదల మీద ఇన్‌స్పైరింగ్‌గా ఏదైనా వీడియో తీయమని స్వచ్ఛంద సేవా సంస్థలు అడగ్గా ఈ ఐడియా వచ్చింది. భావితరాలకు   చెప్పడానికి ఎన్నో ప్రేరణ తెప్పించే కథలు ఉన్నాయి. ఇందులో సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ సూపర్‌ హీరోలే. ఈ సినిమాకు చాలా వీయఫ్‌ఎక్స్‌ పని ఉంటుంది. ఆల్రెడీ ఓ హాలీవుడ్‌ సంస్థతో మాట్లాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. జూడ్‌ ఇది వరకు ఇరాక్‌లో జరిగిన నర్సుల కిడ్నాప్స్‌ ఆధారంగా ‘టేకాఫ్‌’ అనే చిత్రాన్ని రూపొందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top