రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’ | Jai Lava kusa trailer record views in one day | Sakshi
Sakshi News home page

రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’

Sep 12 2017 8:06 AM | Updated on Sep 19 2017 4:26 PM

రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’

రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’.

సాక్షి, హైదరాబాద్‌ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం విడుదలైన జై లవ కుశ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 7.24 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్‌ గా ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్‌లో ఓవరాల్‌గా దర్శక దిగ్గజం ఎస్.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ ట్రైలర్‌ తొలి స్థానంలో ఉందని సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా పేర్కొన్నారు.

తమ మూవీకి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను.. అందుకు ఎంతగానైనా కష్టపడతానని ఎన్టీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అంటూ ట్రైలర్‌ ప్రారంభమైన ట్రైలర్ లో మూడు పాత్రలు కనిపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రాశీ ఖన్నా, నివేధా థామస్‌ నటించారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించాడు. విజయ దశమి కానుకగా సెప్టెంబర్‌ 21న విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement