ఈ జంటకు ఏమైంది.? | Jai Anjali Love Breakup Viral | Sakshi
Sakshi News home page

ఈ జంటకు ఏమైంది.?

Jun 20 2018 9:01 PM | Updated on Jun 20 2018 9:06 PM

Jai Anjali Love Breakup Viral - Sakshi

సాక్షి. సినిమా: నటుడు జై, అంజలిల మధ్య ప్రేమాయణం చాలా కాలంగా సాగుతోందనే ప్రచారం కోడైకూస్తున్న విషయం తెలిసిందే. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట మధ్య అప్పటి నుంచే ఒకరినొకరు ఇష్ట పడ్డారని, ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నారనే ప్రచారం విసృతంగా జరిగింది. ఆ తరువాత కూడా జై, అంజలి కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం బెలూన్‌. ఆ మధ్య నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన మగళీర్‌ మట్టుం చిత్ర యూనిట్‌ దోసె పోటీని సవాల్‌గా తీసుకుని జై తన ఇంట్లో దోసెలు వేసి అంజలికి స్వయంగా పెట్టారు. 

ఆ ఫొటోలను ట్విటర్‌లో పొందుపరిచి ఫుల్‌ పబ్లిసిటీ పొందారు. అదేవిధంగా గత ఏడాది అంజలి పుట్టిన రోజు వేడుక బెలూన్‌ చిత్ర షూటింగ్‌ సెట్‌లో జరగ్గా, జైకి షూటింగ్‌ లేకపోయినా ఆయన ఆ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతోపాటు ట్విటర్‌లో అంజలికి కవిత రూపంలో శుభాకాంక్షలు కూడా తెలిపారు. అలాంటిది గత 17న అంజలి పుట్టిన రోజు సందర్భంగా నటుడు జై ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం వైరల్‌ అవుతోంది. 

అదే విధంగా నటి అంజలి జై కు తనకు మధ్య ప్రేమ లాంటిదేమీ లేదని చెప్పడం విశేషం. ఇకపోతే కొద్ది కాలంగా జై, అంజలి నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించడం లేదు. ఇది కూడా వీరి మధ్య విబేధాలకు కారణం అని కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది‌. ప్రస్తుతం వీరిద్దరూ నటించే చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నటి అంజలి తమిళం, తెలుగు అంటూ నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్‌ మీడియాల్లో మాత్రం జై, అంజలిల లవ్‌ బ్రేకప్‌ అనే ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement