మరోసారి బాలయ్యతో ఢీ!

Jagapathi Babu Turns Villain for Balakrishna And KS Ravikumar Film - Sakshi

ఎన్టీఆర్‌ బయోపిక్‌తో తీవ్రంగా నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పక్కన పెట్టి మరీ తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. గతంలో బాలకృష్ణ, రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైసింహా యావరేజ్‌ టాక్‌తో పరవాలేదనిపించింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా జగపతిబాబు నటించనున్నారట. లెజెండ్ సినిమాతోనే విలన్‌గా మారిన జగ్గుభాయ్‌, ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సీ కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top