
పార్టీ, పబ్ లకు వెళ్లేంత తీరికెక్కడిది: సోనాక్షి
అసభ్యకరమైన పాత్రలను తనకు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆఫర్ చేయలేదని.. తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో సినీ నిర్మాతలకు తెలుసునని సోనాక్షి తెలిపింది.
'దబాంగ్', 'రౌడీ రాథోడ్', 'లుటేరా', తాజా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' చిత్రాలతో సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ల టాప్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. తన కేరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ.. రూమర్లకు, సహచర నటులతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంలో సోనాక్షి సిన్హా తగిన చర్యలు జాగ్రత్తగానే తీసుకుంటోంది.
రూమర్లకు, సెన్సెషనల్ వార్తలకు ఎలా దూరం ఉంటున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ... పబ్, ఫార్టీలకు వెళ్లను. నాకు ప్రైవేట్ జీవితం గడపడమే ఇష్టం. అంతేకాక నిజంగా చెప్పాలంటే నాకు సమయం లేదు అని అన్నారు. నాకు షూటింగ్ లతోనే సమయం గడిచిపోతుంటే.. పార్టీ, పబ్ లకు వెళ్లే తీరిక ఎక్కడుంటుంది అని సోనాక్షి సిన్హా ప్రశ్నించింది.
అంతేకాక అసభ్యకరమైన పాత్రలను తనకు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆఫర్ చేయలేదని.. తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో సినీ నిర్మాతలకు తెలుసునని సోనాక్షి తెలిపింది.