నానీగారి నమ్మకం చూసి భయమేసేది | Sakshi
Sakshi News home page

నానీగారి నమ్మకం చూసి భయమేసేది

Published Sun, Apr 21 2019 12:17 AM

Interview with Gowtam Tinnanuri about Jersey - Sakshi

‘‘మనందరం సక్సెస్‌ అయన ఒక్క వ్యక్తినే గుర్తు పెట్టుకుంటాం. ఎంతో టాలెంట్‌ ఉన్నా వివిధ కారణాల వల్ల సక్సెస్‌ కాలేకపోయిన వాళ్ల కథ చెప్పాలనిపించింది. ఒక సక్సెస్‌ఫుల్‌ మ్యాన్‌ కంటే తొంభైతొమ్మిది మంది ఫెయిల్యూర్‌ కథే మా ‘జెర్సీ’’ అని గౌతమ్‌ తిన్ననూరి అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాద్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది అని చిత్రబృందం పేర్కొంది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి పలు విశేషాలు పంచుకున్నారు.

► ‘మళ్ళీ రావా’ తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలా? వేరే ఏదైనా జానర్‌లో సినిమా చేద్దామా? అనుకున్నాను. క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా బోగ్లే ఓ షోలో ‘‘సచిన్‌ టెండూల్కర్‌లా టాలెంట్‌ ఉన్న క్రికెటర్స్‌ ఇండియాలో చాలామందే ఉన్నారు. సచిన్‌ మాత్రమే అంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే అతని యాటిట్యూడ్‌ వల్లే’’ అని మాట్లాడారు.  99 మంది ఫెయిల్యూర్స్‌ అనే పాయింట్‌ నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రం కోసం స్పెషల్‌గా రీసెర్చ్‌ అంటూ ఏమీ చేయలేదు.   

► నానీగారు మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన 22 సినిమాలు చేశారు. ఆయనకో అవగాహన ఉంది. కానీ నాకిది రెండో సినిమా. గొప్ప సినిమా చే స్తున్నాం అనే ఫీలింగ్‌ కాకుండా కంటెంట్‌ పరంగా తృప్తినిచ్చింది. మిక్సింగ్‌ థియేటర్లో వర్క్‌ పూర్తయ్యాక కొన్నిసార్లు ఇది నేను రాసుకొన్న కథేనా? మేము తీసిందేనా? అనేంతగా వర్క్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చింది. అలాగే నానీగారి నమ్మకం చూసి ఒక్కోసారి భయం వేసేది.

► ఇందులో నానీగారు, విశ్వంత్‌ తప్ప క్రికెట్‌ మ్యాచ్‌ సీన్స్‌లో కనిపించిన మిగతా వాళ్లంతా క్రికెట్‌ ప్లేయర్లే. వాళ్లందరికీ యాక్టింగ్‌లో కోచింగ్‌ ఇచ్చాం. రెగ్యులర్‌ సీన్‌ తీయడం, గ్రౌండ్‌లో మ్యాచ్‌ షూట్‌ చేయడం డిఫరెంట్‌. ఒక్క నిమిషం విజువల్స్‌ రావడానికి  కనీసం ఒకటిన్నర రోజు పట్టేది. స్టోరీ బోర్డ్‌ ముందే రెడీ చేసుకోవటం వల్ల షూటింగ్‌ ఈజీ అయ్యింది. సాధారణంగా డే–నైట్‌ మ్యాచ్‌లో వైట్‌ బాల్‌తో ఆడతారు. సినిమా మొత్తం హీరోను వైట్‌ డ్రెస్‌లోనే చూపించాలన్న ఉద్దేశంతో రెడ్‌ బాల్‌ ఉపయోగించి. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాం.

► ‘మజిలీ’ దర్శకుడు శివనిర్వాణ, నేను క్లోజ్‌. మా ఇద్దరి సినిమాలు క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ అని మాట్లాడుకున్నాం. ఇద్దరి కథలకు చాలా తేడా ఉంది.

► శ్రద్ధా శ్రీనాథ్‌ అద్భుతంగా యాక్ట్‌ చేసింది. నాని కొడుకుగా నటించిన రోనిత్‌ని ఓ ఫోటోషూట్‌లో చూసి అప్రోచ్‌ అయ్యాం. తను బాగా ఎనర్జిటిక్‌. నానీ గారు ఒకవేళ ఈ కథ చెయ్యకపోతే వేరే ఎవరన్నా తమిళ హీరోకి చెప్పేవాడినేమో. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ గురించి ఇంకా ఏం ఆలోచించలేదు.

Advertisement
Advertisement