నాని కాలనీలోకి నాగ్‌ | Interesting Twist in Nani and Nagarjuna Multistarrer | Sakshi
Sakshi News home page

నాని కాలనీలోకి నాగ్‌

Apr 28 2018 12:23 AM | Updated on Jul 21 2019 4:48 PM

Interesting Twist in Nani and Nagarjuna Multistarrer  - Sakshi

నాని, నాగార్జున

కొత్త కాలనీలోకి ఎంటర్‌ అవ్వడానికి మే 2న మూహుర్తం ఫిక్స్‌ చేసుకున్నారు నాని. ఎనిమిది రోజుల తర్వాత ఇదే కాలనీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు నాగార్జున. సినిమా కోసం ఇద్దరూ  కొత్త కాలనీకి రానున్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్‌ ఓ మల్టీస్టారర్‌ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కోటి రూపాయల సెట్‌ వేశారు. నాని కాలనీకి చెందిన సెట్‌ ఇది.

ఈ సెట్‌ తయారు చేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. మే 2న నాని సెట్‌లో జాయిన్‌ అవుతారు. 10న హీరో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మరి.. ఈ కాలనీలో నాగార్జున, నాని ఇరుగు పొరుగుగా ఉంటా రేమో చూడాలి. ఇందులో డాన్‌ పాత్రలో నాగార్జున, డాక్టర్‌ పాత్రలో నాని కనిపించనున్నారని సమాచారం. ఇక కథనాయికల విషయానికొస్తే... నాగార్జున సరసన ‘మళ్లీ రావా’ ఫేమ్‌ ఆకాంక్షాసింగ్,  నాని సరసన ‘ఛలో’ ఫేమ్‌ రష్మిక మండన్నా నటిస్తున్నారు. సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement